ప్రతి విద్యార్థి గ్రీన్ వాలంటీర్ గా తయారు కావాలి
ఎకో వైజాగ్ ను తీర్చిదిద్దాలి

ప్రతి విద్యార్థి గ్రీన్ వాలంటీర్ గా తయారు కావాలి
ఎకో వైజాగ్ ను తీర్చిదిద్దాలి.
– ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు.
– మిషన్ లైఫ్ ను విజయవంతం చేద్దాం.
– ఎకో వైజాగ్ కోసం కృషి చేద్దాం
-జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో
విశాఖ యువతరం ప్రతినిధి;
ప్రతి విద్యార్థి “గ్రీన్ వాలంటీర్” గా తయారు కావాలని ”ఎకో వైజాగ్” ను సాధించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో, వ్యవస్థాపక కార్యదర్శి, వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం మద్దెలపాలెంలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో మిషన్ లైఫ్ గురించి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ లైఫ్ లో భాగంగా 75 ప్రదాన అంశాలను తీసుకొని ప్రతి విద్యార్థి వీటిని అమలు చేయాలని కోరారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్క రీ బాధ్యత అన్నారు. వర్షాకాలం ప్రారంభమైందని ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని, ఆక్సిజన్ శాతం పెంచాలని, కార్బన్డయాక్సైడ్ శాతాన్ని తగ్గించాలని కోరారు. పర్యావరణహితంగా జీవిద్దాం, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ ప్రతినిధి శ్యాం కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జల వనరులను కాపాడాలని, విద్యుత్తును ఆదా చేయాలని, పర్యావరణహితంగా జీవించాలని, విస్తారంగా మొక్కలు నాటాలని, విత్తనబంతులు తయారుచేసి కొండల మీద వేయాలని, కూరగాయ వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసి మొక్కలు పెంచాలని, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వినియోగించవద్దని నినాదాలు పలికారు.