పాములను పట్టడంలో కోసిగి యువకుడు నరసరెడ్డి దిట్ట

పాములను పట్టడంలో కోసిగి యువకుడు నరసరెడ్డి దిట్ట…
కోసిగి యువతరం విలేఖరి;
పాములంటే అందరూ భయపడి ఆమడ దూరం పరిగెడతారు అలాంటిది నాగుపాము అంటే ప్రజలు దరిదాపుల్లో ఉండరు. అలాంటిది ఎలాంటి విషనాగుపాములైన ఆ పాములను తన చేతి మాయతో ఆ యువకుడు పాములను పట్టుకొని వాటిని అడవుల్లోకి వదులుతున్న కోసిగి లో ఉన్న మూడో వార్డు కు చెందిన పర్సాగేరి నరసారెడ్డి యువకుడు సాహసం. వివరాల్లోకి వెళితే కోసిగిలోని మూడో వార్డు వాల్మీకి నగర్ లో కొండగెని అంపయ్య ఇంట్లో నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు ఏమి చేయాలో అర్థం కాక పాములు పట్టడంలో దిట్ట అయినా పరసాగేరి నర్సారెడ్డికి ఫోన్లో సమాచారం అందించారు పొలం పని చేస్తున్న నరసారెడ్డి సమాచారంతో వెంటనే అంపయ్య ఇంటికి వచ్చాడు అప్పటికే నాగుపాము రేకుల షెడ్డులోకి వెళ్లి కనిపించకుండా ఉంది చాకచక్యంగా నాగుపామును ఉన్న జాడను తెలుసుకొని దానిని పట్టుకొని ఓ డబ్బాలో వేసుకొని అడవిలోకి వదులు వదులుతానని నర్సారెడ్డి తెలిపాడు అయితే తాను పట్టుకున్న నాగుపాముతో కొద్దిసేపు ఆ యువకుడు నాగుపామును ఆటపట్టించాడు మెడలో పామును వేసుకొని అలాగే తన చేతితో నాగుపామును ముందుకు వెళ్లకుండా దానిని ఆటపట్టించాడు ఔరా నర్సారెడ్డి అంటూ ఇదంతా చూస్తున్న అక్కడి జనాలు ముక్కున వేలేసుకున్నారు పాములంటేనే నాలుగడుగులు వెనక్కి వేసే ప్రజలు నరసారెడ్డి పాముతో ఆటపట్టించడం చూస్తుంటే పాములు పట్టడంలో నరసారెడ్డి ఎంత నేర్పారో అని అనుకుంటున్నారు అయితే తాను ఎక్కడ పాములున్న ఎవరైనా సమాచారం అందిస్తే ఉచితంగా అక్కడికి వచ్చి పాములు పట్టుకొని అడవుల్లోకి వదులుతానని నర్సారెడ్డి తెలిపారు పాములు అంటే తనకు ఇష్టమని వాటిని చంపరాదని నర్సారెడ్డి అంటున్నాడు మరిన్ని వివరాలకు తన ఫోన్ నెంబర్ 9000735042 నెంబర్ కు సంప్రదించాలన్నారు.