శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చీర సారెలను చింతల రాయిని ఆశీస్సులతో అందజేసిన ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చీర సారె ను చింతల రాయిని ఆశీస్సులతో అందజేసిన ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి
తాడిపత్రి యువతరం ప్రతినిధి;
తాడిపత్రి పట్టణంలో ని శ్రీ చింతల రాయుడు ఆలయం నుంచి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి గత సంవత్సరం నూతన ఒరవడికి ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం స్వామి వారి ఆశీస్సులతో విజయవంతమైనది .అదేవిధంగా రెండో సంవత్సరం ఆషాడ మాసం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు చింతల రాయుడు ఆలయంలో స్వామివారికి అమ్మవారికి ప్రధాన అర్చకుడు మురళి స్వామి ప్రత్యేక పూజలు జరిపించి ఆలయ చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం ఆలయ పురవీధుల నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ సుహాసీనులతో మహిళా ఆలయ కమిటీ సభ్యులతో ఆషాడ మాస సారె పట్టు వస్త్రాలు , పలు రకాల స్వీట్స్ పుష్పాలతో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా ఆలయ చైర్మన్ పోలిశెట్టి ఆంజనేయులు కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి కి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు .
ఈ కార్యక్రమంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి ఈవో సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు నాగిశెట్టి సంజన్న ,భూమా హరి ,కనకాద్రి పల్లి లక్ష్మీదేవి ,మధ్యాల లత , మల్లెల నారాయణమ్మ. సందెపాకుల రమాదేవి
ప్రధాన అర్చకులు మురళి స్వామి
శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పోలిశెట్టి ఆంజనేయులు కమిటీ సభ్యులు అంబటి రాఘవేంద్రా రెడ్డి , హరి ప్రసాద్ ,రమేష్ ,భగీరథమ్మ మంగపట్నం లక్ష్మీదేవి,
ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, చంద్ర స్వామి, మహేష్ స్వామి
శ్రీవారి భక్తులు శివ భక్తులు సుహాసినిలు మరియు పుర ప్రజలు పాల్గొన్నారు