
వాజేడు మండలంలో దారుణం
మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు
భూమి అమ్మకం విషయంలో చెలరేగిన గొడవ
ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన వాజేడు
ఎస్ఐ రేఖ అశోక్
వాజేడు యువతరం విలేఖరి;
పచ్చగా ఉన్న పల్లెల్లో మద్యం చిచ్చు మత్తులో కన్ను, మిన్ను కానక తండ్రి మూడెం రామయ్య పై గొడవకు దిగిన అన్న మూడేం చంటిని వారించబోయిన తమ్ముణ్ణి నాన్న నోటికొచ్చిన బూతులు తిట్టిన అన్న ఆ సందర్భంలో
కోపోద్రిక్తుడైన తమ్ముడు మూడేం శివాజీ అడవి జంతువులను వేటాడి బరిసెతో అన్నను పొడవడంతో పేగులు బయటికి వచ్చి అన్నమోడియం చంటి మరణించిన సంఘటన వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. సంఘటన స్థలాన్ని ప వాజేడు ఎస్సై రేఖ అశోక్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా మధ్యాహ్నం మృతుడు మద్యం మత్తులో తరచూ తమ్ముడితో గొడవపడేవాడని బంధువులు తెలిపారు. మృతునికి నేర చరిత్ర కలదు. చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదండ గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నా అనంతరం 15 సంవత్సరాలుగా అక్కడే జీవనం సాగించిన చంటి సంవత్సరం క్రితం ఓ మహిళపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చి జీవిస్తున్నాడు అని తెలిపారు. ఈ సందర్భంలో మత్తుకు బానిసై వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మటానికి నిర్ణయించడంతో తండ్రి రామయ్య తమ్ముడు శివాజీ పిల్లలు ఉన్నారు భూమి విక్రయించవద్దు అని వారించారు. సహనం కోల్పోయిన చంటి తండ్రి రామయ్య ను తమ్ముడు శివాజీని నానా బూతులు తిట్టడంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నపై భరిషతో దాడి చేయడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఏటూరు నాగారం తరలించారు.