మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన వ్యవస్థలు

మోడీ చేతిలో కీలుబొమ్మ గా మారిన వ్యవస్థలు..
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
రాహుల్ గాంధీ పై అభియోగింపబడిన పరువు నష్టం కేసులో గుజరాత్ హై కోర్టు తీర్పును నిరసిస్తూ కళ్లకు గంతులు కట్టుకొని శుక్రవారం ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో బిసి వసతి గృహం ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా వీరేష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఫాసిస్ట్ శక్తులు ప్రజల పక్షాన ప్రశ్నలు లేవనెత్తకూడదని, ద్రవ్యోల్బణం గురించి అడగకూడదని ,యువత ఉపాధి కై గొంతెత్త కూడదని, రైతుల సంక్షేమం కోసం గళం విప్పకూడదని, మహిళల హక్కుల గురించి మాట్లాడకూడదని, కూలీల గౌరవం గురించి ప్రశ్నించకూడదని కోరుకుంటున్న ఈ అహంకార శక్తులు సత్యాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ, ప్రజ ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నల నుండి దృష్టి మరల్చడానికి , ధరలు, శిక్షలు, వివక్ష, మోసం , వంచన లాంటి మార్గాలను అవలంబిస్తోందన్నారు. కానీ, సత్యం ముంధు అధికార దురహంకారం గానీ, అబద్ధాల ముసుగు గానీ ఎక్కువ కాలం నిలబడలేవు. ఈ దురహంకార శక్తుల ముందు రాహుల్ గాంధీ ప్రజల కోసం సంబంధించిన ప్రశ్నల వైపే ఉంటారన్నారు.
దీని కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమని, అహంకారపూరిత బీజేపీ ప్రభుత్వం ఎన్ని దాడులు, వ్యూహాలు పన్నినా నిజమైన దేశభక్తుడిలా ప్రజలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తడంలో వెనుకడుగు వేయడని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం కొనసాగిస్తాడని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు వివేక్,కుమార్, ఉదయ్ అజయ్ భాస్కర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.