మణుగూరు మున్సిపాలిటీ కమిషనరా….. మజాకా

మణుగూరు మున్సిపాలిటీ కమిషనర మజాకా..?
మున్సిపాలిటీ పరిధిలో సంజీవని పిల్లలు హాస్పిటల్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనం నిర్మిస్తున్న చర్యలు శూన్యం..!
ఫిర్యాదు చేయడమే ఆలస్యం… ఆక్రమణదారులతో చేతులు కలిపి ఆఫీసు కు పిలిపించి సెటిల్ మెంట్….?????
భద్రాద్రి కొత్తగూడెం యువతరం ప్రతినిధి;
మణుగూరు గ్రామ పంచాయతీ గా ఉన్నా మణుగూరు ను ఏజన్సీ చట్టాలకు, రాజ్యాంగంకు వ్యతిరేకంగా 2005 లో మణుగూరు మున్సిపాలిటీ గా మార్చడం జరిగింది . మణుగూరు మున్సిపాలిటీ వద్దు మణుగూరు గ్రామ పంచాయతీ కావాలని ఉమ్మడి హైకోర్టు లో కేసు నమోదు చేయడం జరిగింది. ఉమ్మడి హైకోర్టు 2005 లో స్టే విధించింది .ఆ రోజు నుండి ఈరోజు వరకు ఆ స్టే కొనసాగుతున్న, మణుగూరు మున్సిపాలిటీ కి వచ్చిన కమిషనర్లు అందరూ 1/70 యాక్ట్ చట్టాన్ని చెత్త కుప్పలో పడవేసి ఇష్టం వచ్చినట్టు ఇంటి నెంబర్లను ఇవ్వడం జరుగుతుంది . ఇది అంతా తప్పని తెలిసిన కుడా.. భూమి క్రయ విక్రయాలు లేవని తెలిసిన ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారో వారికి తెలియదు. మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్లు ఎంత మంది అవినీతి అక్రమాల చేసి సస్పెండ్ అయిన వీరు విధానం లో మార్పు రావడం లేదు. ప్రజాప్రతినిధుల ఎన్నిక లేక .. అధికారులది పాడిందే పాట..అంటూ.. అవినీతి, అక్రమాలు పుట్టగా మణుగూరు మున్సిపాలిటీ మారిందని అన్నారు. అందుకు నిదర్శనమే నేడు.. మణుగూరు మండలం లోని పాత ఆంధ్ర బ్యాంకు ప్రక్కనే ఉన్న వాగును కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం చేపట్టారనీ, గతంలో వివిధ పత్రికలలో రావడం వల్ల దాని వదిలి వేసి వారి హాస్పిటల్ నిర్మాణం చేశారు మరలా ఇప్పుడు ఆ హాస్పిటల్ వెనుక ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి హాస్పిటల్ వెనుక జరిపి నిర్మాణం చేపట్టారు దిని పైన నేను మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ కి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క పిర్యాదు పైన చర్యలు తీసుకోకపోగా.. అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాదారులతో… మున్సిపాలిటీ వారు ఆఫీస్ కి పిలిపించుకొని, వారు ఇచ్చే ప్రతిఫలాన్ని ఆశించి, మీరు నిర్మాణము చేసుకోండి.. మేము అపుచేయ్యం అనే భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా ఏజన్సీ ఏరియా అయితే ఎంటి.. నిర్మాణాదారులకు అన్ని కాగితాలు ఉన్నాయి , మాకు చట్టాలు తెలుసు , అన్ని అనుమతులు మంజూరు చేస్తామని కమిషనర్ చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. గతం లో 2020 సంవత్సరం లో వర్షాలు కురిసి వాగు లో నుంచి నీళ్ళు పోకపోతే.. అప్పుడు ఉన్న కమిషనర్ వెంకట్ స్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి వాగు పై ఉన్న సైడ్ డ్రైనేజీ మిషన్ తో పగలు కొట్టడము జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని , ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనం నిర్మిస్తున్న ఈ కమిషనర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ఆక్రమించిన వారికి వత్తాసు పలుకుతున్నారు. కనీసం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటీడీపీఓ స్పందించి తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతున్నాము. ప్రజల అనారోగ్యాలకు , డ్రైనేజీ వ్యవస్థకు మున్సిపల్ కమిషనర్ యే పూర్తి బాధ్యత వ్యహించాలని ఆదివాసి సేన రాష్ట్ర కమిటీ సభ్యులు వజ్జా జ్యోతి బసు కోరారు.