ANDHRA PRADESHSOCIAL SERVICE
చందోలిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

చందోలిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
పత్తికొండ యువతరం ప్రతినిధి;
మండలంలోని చందోలి గ్రామంలో ఎస్సీ కాలనీలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ముత్యాల ఈశ్వరయ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 59వ జన్మదినాన్ని పురష్కరించుకుని ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి, అనుబంధ సంఘాల ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మందకృష్ణమాదిగ ఆలుపెరుగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేదల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు మనోహర్, దేవదాసు, జయన్న, సునీల్, ప్రశాంత్, రాముడు, అనిల్, యేసు రత్నం, విజయ్ బాబు, ఫిలిప్, ఆనంద్, ఏలియా, తేజస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.