కిడ్నీ సమస్యతో బాధపడుతున్న టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడికి లక్ష రూపాయల ఎల్ఓసి అందించిన రెడ్ కో చైర్మన్
సతీష్ రెడ్డి

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడికి లక్ష రూపాయల ఎల్ ఓ సి అందించిన రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
ములుగు యువతరం ప్రతినిధి;
అనారోగ్యంతో బాధపడుతున్న ములుగు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడికి ఎల్ ఓ సి కింద తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు ఇప్పించారు. గోవిందరావు పేట మండలం, చల్వాయి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాంపూర్ణ చందర్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో ఎల్ ఓ సి ద్వారా రూ.1లక్ష చెక్కును సతీష్ రెడ్డి పూర్ణచందర్ సోదరుడు రవి కి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో అందించారు. వైద్యానికి మరింత ఖర్చు అయినా తాను అండగా ఉంటానని, పార్టీ, ప్రభుత్వం తరుపున సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. పూర్ణచందర్ కు సర్జరీ విజయవంతంగా పూర్తై, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.