ఎంఆర్పిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం

ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం
కర్నూలు యువతరం ప్రతినిధి;
1994 జులై 7 వ తారీఖున మాదిగల ఆత్మగౌరవ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మ దినం దళిత పీడిత వర్గాలకు అది శుభదినంగా గర్విస్తున్నాము అని ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ రెడ్డి పోగు భాస్కర్ తెలిపారు. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ 59 ఉప కులాల వారి జనాభా ప్రతిపాదికన వర్గీకరణ జరగాలని 29 సంవత్సరాలుగా అనేక అవమానాలను అధిగమిస్తూ పోరాటాలను కొనసాగిస్తూ రావడం మాదిగ జాతి ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఒక పక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ కై పోరాటాలు చేస్తూనే మరో పక్క మానవీయ కోణంలో చరిత్రలో నిలిచే ఉద్యమాలను నడిపినటువంటి చరిత్ర మాదిగ దండోరా ఉద్యమానికి ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ, అగ్రకుల, పేదల సామాజిక న్యాయం కోసం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కోసం ఆత్మగౌరవం హక్కులు, రాజ్యాధికారం దిశగా నిర్మాణం చైతన్యం పోరాటలను నడిపించిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమానంతరం కర్నూల్ లోని ఎస్సీ ఈ ఆర్ యు డి ఎస్ అనాధ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు ఎన్ వెంకటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర మాదిగ, రత్నమయ్య మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ గ్రామ అధ్యక్షులు తిరుపాలు మాదిగ, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మాదిగ, గ్రామ సర్పంచ్ మద్దిలేటీ, తోల్ల మద్దిలేటి, అయ్యన్న,వెంకటేశ్వర్లు, మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.