
ఆదర్శ పాలనతో సుస్థిర స్థానం : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 23వ వార్డు సచివాలయం కోడ్ (21018019) లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన సాగిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక 23వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వారికి అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర సౌకర్యాలు కావాలని ఆయన దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. పై సమస్యలు వేంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎర్రకోట జగనన్న మాట్లాడుతూ ఏ ఒక కుటుంబం ఇబ్బంది పడకూడదని భావించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ జగనన్న అమలు చేశారన్నారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఒక ప్రణాళిక మేరకు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, పార్టీ నాయకులు, చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలెంటర్లు తదితరులు పాల్గొన్నారు.