ANDHRA PRADESHSTATE NEWS
అంగన్వాడీల సమస్యల కోసం ధర్నాను జయప్రదం చేయండి

అంగన్వాడీల సమస్యల కోసం ధర్నా ను జయప్రదం చేయండి
సిఐటియు
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 10 11వ తేదీన నిర్వహించు ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి బి రాముడు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధనమ్మ నాగలక్ష్మి పిలుపునిచ్చారు . శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో సిడిపిఓ కు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. దీనివల్ల గర్భవతులు బాలింతలు చిన్న పిల్లలు పోషకాహారం అనారోగ్యం పాలవుతారు అన్నారు. బడ్జెట్లో నిధులు పెంచాలని, అంగన్వాడీల అపరిష్కృత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి శ్రీదేవి శైలజ పాల్గొన్నారు.