అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
తాడిపత్రి యువతరం ప్రతినిధి;
అనంతపురము రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె. ఈశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఉదయము 05.30 తాడిపత్రి టౌన్ గన్నె వారిపల్లె కాలనీ వద్ద అనంతపురము ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారులు సీఐ వి. వెంకటరమణ, ఏఈఈ రవీంద్రనాథ్ మరియు సిబ్బంది, స్థానిక మండల రెవెన్యూ అధికారులతో కలసి వాహనముల తనిఖీ చేయడం జరిగింది. అక్రమంగా రవాణా చేయుచున్న 30.90 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం 53 ప్లాస్టిక్ బ్యాగులతో మరియు ఏపీ 04 టిటి -4916 నెంబరు గల మహేంద్ర బొలెరో పికప్ వాహనమును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు బద్రత చట్టపరమైన చర్యల నిమిత్తం ఈసీ యాక్ట్ 1955 నిబందనల మేరకు కే. రాజా, సి ఎస్ డి టి కి స్వాదినపరచామన్నారు. నిందితులైన జూటూరు రామాంజినేయులు డ్రైవర్ మరియు పిడిఎస్ బియ్యం ఓనర్, సోమన్నగారి నాగరాజు ల పై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు.