ANDHRA PRADESHCRIME NEWS
రెండు ట్రాక్టర్లు పట్టివేత
రెండు ట్రాక్టర్లు పట్టివేత
వెల్దుర్తి యువతరం విలేఖరి
మండలంలోని రామళ్ళకోట గ్రామ సమీపంలో రెండు ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక ట్రాక్టర్ లో అనుమతులు లేకుండా ఇనుప ఖనిజము, మరొక ట్రాక్టర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నరికిన మామిడి మొద్దులు వెళుతున్నట్లు సమాచారం. ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. మామిడి మొద్దులతో వెళుతున్న ట్రాక్టర్ కు చలాన విధించినట్లు సమాచారం. అదేవిధంగా అనుమతులు లేకుండా ఇనుపఖనిజంతో వెళుతున్న ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.