జూలై 9న జరిగే టీచర్స్ విద్యా సదస్సును జయప్రదం చేయండి

జూలై 9 న జరిగే టీచర్స్ విద్యా సదస్సును జయప్రదం చేయండి
భద్రాద్రి కొత్తగూడెం యువతరం ప్రతినిధి.
జూలై 9న భద్రాచలం ఐటీడీఏ టీచర్స్ విద్యా సదస్సును జయప్రదం చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు కోరారు. బుధవారం పినపాక మండల పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో పాఠశాలలో టీఎస్ యుటియఫ్ పినపాక మండల అధ్యక్షుడు జి. కిరణ్ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ
ఐటీడీఏ ఉపాధ్యాయుల, స్కూల్స్, సిఆర్టిల సమస్యలను తక్షణమే పరిష్కరించి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఐటీడీయే భద్రాచలం గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, కన్వర్టెడ్ స్కూల్స్ లలో పోస్టులు మంజూరు చేసి నూతన నియామకాలు చేయాలని, మధ్యంతర భృతి ప్రకటించి జూలై 1 నుండి పీఆర్సీని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న టీచర్స్ ను రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు మినిమం బేసిక్ పే తో రెగ్యులర్ గా జీతాలు ఇవ్వాలని, అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం నూతనంగా ప్రవేపెట్టిన ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ లో చేరి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే విద్యా సదస్సును అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యుటియఫ్ జిల్లా కార్యదర్శి బి.రాము , టీఎస్ యుటిఎఫ్ వోట్ పత్రిక జిల్లా కన్వీనర్, మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు కారం సీతారామయ్య, మీరా హుస్సేన్, ఐటీడియే సబ్ కమిటీ సభ్యులు వీరాస్వామి, టీఎస్ యుటిఎఫ్ పినపాక మండల ప్రధాన కార్యదర్శి బి. భాస్కర్ రావు, ట్రెజరర్ కాంత రావు ఉపాద్యాయులు, సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.