పంట నష్టపోయిన రైతులకు భీమా వెంటనే చెల్లించాలి
తెలుగు తమ్ముళ్ల డిమాండ్

పంట నష్టపోయిన రైతులకు బీమా వెంటనే ఇవ్వాలి
అమడుగురు యువతరం విలేఖరి;
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుదవారం తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు అమడగూరు మండలంలో పంట నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, నష్టపోయిన రైతులకు వెంటనే ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు.కన్వీనర్ మాట్లాడుతూ ప్రభుత్వం మా ప్రభుత్వం రైతులు పార్టీ అని గొప్పలు చెప్పుకుంటుందని ప్రభుత్వం అందించిన బీమాలో ఎక్కువ మంది రైతులు వై ఎస్ ఆర్ సి పి నాయకులే ఉన్నారు.బోగస్ పేర్లతో వైకాపా నాయకులు తమ అకౌంట్లోకి డబ్బులు వేయించుకున్నారన్నారని విమర్శించారు.అసలైన రైతులను గుర్తించి వెంటనే న్యాయం చేయాలని డిప్యూటీ తహసీల్దార్ నందినికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.నాయకులు కార్యకర్తలు రైతులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వల్లెపు సోమశేఖర్,సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి,మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు వల్లిపి కిష్టప్ప,తిరుపాలు,రాజా రెడ్డి, రమణారెడ్డి, దొడ్డం నరసింహమూర్తి టిఎన్టియుసి మూర్తి శివారెడ్డి, ఆదినారాయణ రెడ్డి,రామచంద్ర,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎం ఆంజనేయులు, రంగప్ప, ,నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.