POLITICSSTATE NEWSTELANGANA

షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక

కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానం పలికిన మాజీమంత్రి షబ్బీర్ అలీ

షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక

కామారెడ్డి యువతరం ప్రతినిధి;

పట్టణంలోని 25 వార్డు నుండి ముదాం గల్లికి చెందిన 25 కుటుంబాలు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు .
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగింది అన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇవ్వలేదు అని తెలిపారు.
ఇంట్లో నలుగురికి ఉన్న పెన్షన్ను రద్దు చేసి ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరిగింది దీంతో కుటుంబంలోనే కలహాలు పెట్టారన్నారు.నిత్యవసర ధరలు ఆకాశన్ని అంటుతున్నాయి మంచి నూనె, కూరగాయలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రతిదానిపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయి అధిక ధరలు పేద ప్రజల చావుకు వచ్చింది అని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ నీ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదు దీనితో పేదలు ప్రైవేట్ హాస్పిటల్ పాలై కుటుంబాలు దోపిడీకి గురై రోడ్డుపైకి వస్తున్నాయి అన్నారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి పేదలకు ఇల్లు కట్టిస్తాం అని తెలిపారు.
ప్రతి ఇంటికి రూ 4 వేలు రూపాయలు పెన్షన్ అందే విధంగా అమలు చేస్తాం
500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తాం అని హామీ ఇచ్చారు.
నిత్యవసర వస్తువులపై నియంత్రణ చేసి ధరలు పెరగకుండా కట్టడి చేస్తాం అన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తాం, విద్యార్థులకు సకాలంలో ఫీజులు అందించి స్కాలర్షిప్ ఇచ్చి వారికి ఉన్నతమైన చదువులు అందిస్తాం అన్నారు.
అందరు సైనికుల కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రంలో దేశంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బాన్స్ వాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొనె శ్రీను కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి, బీబీపేట్ మండల అధ్యక్షులు సుతారి రమేష్, సీనియర్ నాయకులు పంపరి లక్ష్మణ్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్, పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీను, చందు, రాజశేఖర్ సల్మాన్, జమీల్, శంకర్, హోసన్నా తతిదరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!