మంగపేట మండలంలో సంత మార్కెట్ కోసం స్థలం కేటాయించాలి

మంగపేట మండలంలో సంత జరుగుటకు మార్కెట్ కు స్థలం కేటాయించాలి.
ములుగు జిల్లా, యువతరం ప్రతినిధి.
ములుగు జిల్లా మంగపేట సంత మార్కెట్ పై విషయంల గురించి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ , ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాణోత్ రవిచందర్ ఆదేశాలమేరకు ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్ ఆధ్వర్యంలో..
మంగపేట మండల తహసీల్దార్ కి మంగపేట గ్రామపంచాయతీ కార్యదర్శి కి బుధవారం వినతి పత్రం అందచేయడం జరిగింది. విషయం ఏమనగా మంగపేట మండలం లో ఇంతకు ముందు సంత మార్కెట్ జరిగేది.. పదిహేను సంవత్సరాలనుండి సంత మార్కెట్ లేదు మరల కొత్తగా మంగపేట లో సంత మార్కెట్ జరుగుటకు స్థలం కేటాయించి సంత మార్కెట్ జరిపించగలరని కోరుచున్నాము.
సంత జరుగుతే గ్రామ పంచాయతీ కి కూడ ఆదాయం వస్తుంది. మండల పరిధిలో ఉన్న దుకాణాదారులకు కూడా గిరాఖీలు పెరుగుతాయి. తక్షణమే ఈ విషయాన్నీ స్పందించి మంగపేట లో సంత మార్కెట్ ఏర్పటు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ తరుపున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మంగపేట మండల మైనార్టీ అధ్యక్షులు హిధైతుల్లా,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యాక్షులు కుర్సం రమేష్, గౌరవధ్యక్షులు జగం భాను సీనియర్ నాయకులు అయ్యోరి యాణయ్య,తుడి భగవాన్ రెడ్డి, గుగ్గిళ్ల సురేష్, బుర్గుల సతీష్,కస్పా ముకుందం, గగ్గురి మహేష్ ,బేత నర్సింహారావు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ముత్యాలు తదితరులు పాలుగోన్నారు.