ANDHRA PRADESHBREAKING NEWSEDUCATIONSTATE NEWS

నత్తనడకన నాడు నేడు పనులతో అవస్థలు

ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు

నత్తనడకన నాడునేడు పనులతో అవస్థలు

కొత్తపల్లి యువతరం విలేఖరి;

నత్తనడకన జరుగుతున్న నాడు నేడు పనులతో విద్యార్థులకు అవస్థలు తప్పట్లేదు. కొత్తపల్లి మండంలోని గోకవరం జడ్పీ పాఠశాలలో ప్రహరి గోడ నిర్మించేందుకు నెల రోజుల క్రితం గుంతలు తీసి వదిలేయడంతో గుంతల్లో వర్షపు నీరు ఆగి ప్రమాదకరంగా మారాయి. విద్యార్థులు పోరాపాటున అటుపక్క వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలు పూడ్చి ప్రహరి పనులు త్వరగా
పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం నాడు నేడు పనులకు బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నా నిర్లక్ష్యం ఎందుకో మరి అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!