ANDHRA PRADESHEDUCATION
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో రెండు ఎస్టీ సీట్లు ఖాళీ
బాలికలకు మాత్రమే
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో రెండు ఎస్టీ సీట్లు ఖాళీ
వెల్దుర్తి యువతరం విలేఖరి;
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వెల్దుర్తి గురుకుల పాఠశాలలో ఎస్టీ వర్గానికి చెందిన బాలికలకు ఆరవ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపల్ జి లక్ష్మీ ప్రసూన బుధవారం తెలిపారు. ఎస్టి వర్గానికి కేటాయించబడిన సీట్లు ఖాళీగా ఉన్నాయి, కావున ఆరవ తరగతిలో చేరాలనుకునే ఎస్టీ విద్యార్థినిలు వెల్దుర్తి గురుకులంలో ఈనెల 7న సాయంకాలం 4 గంటల లోపు దరఖాస్తు నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 8న రాత పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కనుక ఈ అవకాశాన్ని ఎస్టి వర్గమునకు చెందిన వారు మాత్రమే వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.