జగనన్న సురక్షతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
వైసీపీ నేత రంగనాథరెడ్డి

జగనన్న సురక్ష తో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
వైసీపీ నేత రంగనాథరెడ్డి
తుగ్గలి యువతరం విలేఖరి;
అర్హత ఉన్న ఏ ఒక్కరు నష్టపోకూడదన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు, వైసీపీ నేత రంగనాథరెడ్డి తెలిపారు. బుధవారం చెన్నంపల్లి గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రంగనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాల కోసం అధికారులు జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగిన ఫలితం ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే నేడు ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వెళ్లి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం పలువురికి ఉచితంగా వివిధ ధ్రువీకరణ పత్రాలను ఆయన అధికారులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు నాయక్, వీఆర్వోలు కృష్ణారెడ్డి, నాగేంద్ర ,వైసిపి నాయకులు బి. హనుమంత్ రెడ్డి, సుంకన్న, వడ్డే వెంకటరాముడు, రంజాన్,సవాసి, వెంకటయ్య ,సుధాకర్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.