చిరస్మరణీయుడు సీనియర్ జర్నలిస్టు నాగయ్య
30 ఏళ్లకు పైగా జర్నలిజంలో సేవలు

చిరస్మరణీయుడు సీనియర్ జర్నలిస్టు నాగయ్య
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మృతుడు సీనియర్ జర్నలిస్టు నాగయ్య చిరస్మరణీయుడు అని వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల జర్నలిస్టులు పేర్కొన్నారు. జర్నలిస్టు నాగయ్య మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి భోజనానంతరం గుండె నొప్పితో బాధపడుతున్న నాకేదో కర్నూలు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల జర్నలిస్టులు బుధవారం వెల్దుర్తి లోని ఆయన స్వగృహంలో పార్టీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు సీనియర్ జర్నలిస్టు నాగయ్య సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన సౌమ్యుడుగా, మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్నారన్నారు. క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలలో నాయకులు మరియు అధికారుల వద్ద తలలో నాలుకగా మారారు అని తెలిపారు. గత 30 సంవత్సరములుగా క్రిష్ణగిరి మండలంలో విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో ఆయన పనిచేశారన్నారు. ప్రస్తుతం నాగయ్య ఆంధ్ర అక్షర దినపత్రిక విలేకరిగా సేవలందిస్తున్నారు అని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు నాగయ్య మరణ వార్త తెలుసుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఫారిన్ లో ఉన్న క్రిష్ణగిరి జడ్పిటిసి సభ్యురాలు కేఈ సుభాషిని కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయం అందించారు. క్రిష్ణగిరి ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, వెల్దుర్తి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, జడ్పిటిసి సుంకన్న, క్రిష్ణగిరి మాజీ జెడ్పిటిసి కేఈ జయన్న, క్రిష్ణగిరి మండల అధ్యక్ష, కార్యదర్శులు మర్రి శ్రీరాములు, గురుస్వామి, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మృతుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర అక్షర ఏపీ బ్యూరో డోన్ ఆచారి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, నాయకులు నివాళులు అర్పించి అంత్యక్రియలో పాల్గొన్నారు. మృతుడు సీనియర్ జర్నలిస్టు నాగయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.