కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, యువతరం ప్రతినిధి.
అశ్వాపురం మండలం మొండికుంట కె.వి.ఆర్ ఫంక్షన్ నందు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, 26 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 26 లక్షల రూపాయల విలువగల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందఅన్నారు.పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,పథకం నేటి వరకు 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఇచ్చింద అన్నారు.
అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ది పెద్ద మనసు అని అనేక పథకాలు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.
ఆడపిల్ల పెండ్లి అనంతరం కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష 116 రూపాయలు , గర్భం దాల్చితే అంగన్వాడి ద్వారా పోషకాహారం ప్రభుత్వం ఆసుపత్రిలో నాణ్యమైన ఉచిత కాన్పు అనంతరం కెసిఆర్ కిట్టు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు మగ బిడ్డ పుడితే రూ.12 వేలు ఆయాబిడ్డలు చదువుకోడానికి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతూ వారికి అన్ని తానే నిలిచింది ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.
సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతోమంది పేద కుటుంబాలు పెండ్లిల్లు భారం తగ్గిందని తెలిపారు. ఆడబిడ్డలు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.