అంగన్వాడీ వర్కర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించండి

అంగన్వాడీ వర్కర్ల అపరిస్కృత సమస్యలను పరిష్కరించండి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
అంగన్వాడి వర్కర్ల అపరిస్కృతి సమస్యను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు బి గోవర్ధనమ్మ, ఎస్ నాగలక్ష్మి, సిఐటియు డివిజన్ కార్యదర్శి బి రాముడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 10 ,11వ తేదీల్లో ధర్నా చౌక్ వద్ద 36 గంటల పాటు నిర్వహించు ధర్నాలు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ ఐసిడిఎస్ పథకానికి కేంద్రంలో కావాల్సిన నిధులు కేటాయించడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీసం 26,000 అందించాలని, బాలింతలకు పిల్లలకు పెంచాలని, అంగన్వాడీలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ యూనియన్ నాయకులు మల్లేశ్వరి నీరజ శైలజ సుమిత్ర భారతి అరుణ శకుంతల తదితరులు పాల్గొన్నారు.