
లక్ష గర్జనను విజయవంతం చేయండి
మల్లెల జయరాం
అమరగూ రు యువతరం విలేకరి;
మండల కేంద్రం లోని వడ్డెర సంఘం కార్యాలయంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు కిస్టప్ప అధ్యక్షతన శనివారం బిసిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు మల్లెల జయరామ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మల్లెల జయరాం మాట్లడుతూ ఆగష్టు 26వ తేదీన బిసిల వడ్డెర గర్జన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లక్ష గర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరయ్యి విజయవంతం చేయాలని తెలిపారు.గత 20 సంవత్సరాలు గా పుట్టపర్తి నియోజకవర్గం లో బిసిల సమస్యలు పై ప్రభుత్వం పై రాజీలేని పోరాటాలు చేస్తూ వారి సమస్యలు కోసం పోరాడుతున్నాన్నారు.వారికి కష్టం వచ్చిన వారి ఆత్మీయుడుగా వారి వెన్నెంటే వుండి ఆర్థికంగా సామాజికంగా ,రాజకీయంగా వారి అభివృద్ధికి పాటు పడుతున్నాన ని తెలిపారు.రాబోయే రోజుల్లో బిసిల సహకారంతో రెట్టింపు ఉత్సహాంతో పనిచేస్తానని తెలిపారు.అంతే కాకుండా వడ్డెరలకు చట్ట సభల్లో అవకాశం కల్పించాలని తెలిపారు.రాబోయే ఎన్నికలలో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులుగా వడ్డెర్లకు అవకాశం కల్పించాలని తెలిపారు.బిసిల అందరి సహకారంతో ముందుకు వెలతాన ని తెలిపారు.అనంతరం కొలిమిరాళ్లపల్లి ఇటివల ప్రమాదానికి గురైన వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు వల్లిపి కిష్టప్ప, వలిపి అంగడి అమర,బొట్టు సయధాకర్, పల్లపు రామచంద్ర,తిరుపాలు,రామప్ప,వల్లిపి రామచంద్ర,శ్రీరాములు,శ్రీనివాసులు,గంగులప్ప,స్టూడియో మూర్తి,ఆదెప్ప,ఆంజనేయులు,బుదిలిపల్లి రంగయ్య,గోవిందురాజులు,గంగాద్రీ,వెంకటనారాయణ,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.