ANDHRA PRADESHSOCIAL SERVICESTATE NEWS

మంత్రాలయంలో మహిళా ఐక్యవేదిక సమావేశం

మంత్రాలయంలో మహిళ ఐక్యవేదిక సమావేశం

మంత్రాలయం యువతరం విలేఖరి;

మంత్రాలయంలో భారతమ్మ అధ్యక్షతన యస్సీ, యస్టీ, బిసి, మైనార్టీ మహిళా ఐక్య వేదిక సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి,రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సామాజిక చైతన్యంతో అడుగులు వేయాలని, మహిళలంతా ఏకమై వివక్షతకు,అసమానతలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్దం కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం మహిళలంతా కలిసి మంత్రాలయం మండల అధ్యక్షురాలుగా కంసలి లక్ష్మీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలీశమ్మ, ఈరమ్మ, హుస్సేన్ బి, ఖాసింబి, మాబ్బీ,లక్ష్మీ, రేవతి, డి.లక్ష్మీ , జయమ్మ , టి.లక్ష్మీ , పద్మావతి, పి.లక్ష్మీ, ముత్యాలమ్మ , అనంతమ్మ,వెంకమ్మ, మహాలక్ష్మి, సుశీల, అమీనాబీ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!