సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష

సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష
వెల్దుర్తి యువతరం విలేఖరి;
సత్వర సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష అని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసకుమార్, డిఎల్పిఓ బాలకృష్ణారెడ్డి, సచివాలయ కన్వీనర్ల మండల ఇంచార్జ్ దేశాయి సమీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని గోవర్ధనగిరి 1,2 సచివాలయాల పరిధిలో తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపిడిఓ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసిల్దార్ ప్రశాంత్ రాజుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. గోవర్ధనగిరి రెండు సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి గుర్తించిన సమస్యల సాధనలో భాగంగా జగనన్న సురక్ష పథకం సంబంధించి 344 ఫిర్యాదులు స్వీకరించి అర్హత గల 318 రిజిస్టర్ చేసి అందులోని 261 మంది లబ్ధిదారులకు పలు రకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా వెంటనే అందజేశారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రంగడు, సర్పంచ్ ఎల్ల రాముడు, అల్లుగుండు శ్రీరాంరెడ్డి, గోవర్ధనగిరి కేశవ్, చెర్ల కొత్తూరు సీతారామయ్య, గోపాల్, సచివాలయ ఉద్యోగులు, కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.