వైయస్సార్ భీమా నగదును అందజేసిన ఎమ్మెల్యే అనంత

వైయస్సార్ బీమా నగదును అందజేసిన ఎమ్మెల్యే అనంత
అనంతపురం యువతరం ప్రతినిధి;
నగరంలోని అరుణోదయ కాలనీ కు చెందిన సిద్దయ్య గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చేదోడుగా ఉండాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వైయస్సార్ భీమా పథకం ద్వారా సిద్దయ్య భార్య భాగ్యమ్మ కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రూ.5 లక్షలను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు వలీ మరణించడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మరణిస్తే బాధితులకు కుటుంబాలకు భారం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ భీమా పథకంను తీసుకువచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ పేదల సంక్షేమం గురించే ఆలోచించే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి అని కొనియాడారు. వలీ కుటుంబ సభ్యులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గురు శేఖర్ బాబు, సచివాలయ సిబ్బంది కిషోర్,కుస్మా,శంకర్ రెడ్డి,ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.