
విద్యుత్ లైన్ మేన్ పై సర్పంచ్ దాడి
వెల్దుర్తి యువతరం విలేఖరి;
విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ లైన్ మేన్ పై దాడి జరిగిన సంఘటన మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు లైన్ మేన్ తిరుమల నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం గోవర్ధనగిరిలో విధి నిర్వహణలో ఉండగా వీధిలైట్లు వేయలేదని సర్పంచ్ అడిగినట్లు తెలిపారు. మీరు లైట్లు ఇవ్వలేదు, నేను వేయలేదు అని సమాధానం చెప్పానన్నారు. దీనిపై ఆగ్రహించిన సర్పంచ్ విధి నిర్వహణలో ఉన్న తనపై భౌతికంగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న ఏడిఈ కెవి రమణారావు, ఏఈ రాఘవేంద్ర ప్రసాద్ సంఘటనను తీవ్రంగా ఖండించారు, బాధితుడు తిరుమల నాయుడు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న
ఎం లక్ష్మీకాంతరెడ్డి 1104 డివిజన్ ప్రెసిడెంట్, నాగచంద్రుడు వైఎస్ఆర్సిపి సెక్రటరీ డోన్ డివిజన్, వెంకట్రాముడు తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు , డోన్ డివిజన్ స్టాప్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయవలసిందిగా వారు పోలీసులను కోరారు. ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో ఉన్న తమపై దాడి చేయడం నీతిమాలిన చర్య అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.