
వానొస్తే..గ్రామీణులకు అవస్తే
కొత్తపల్లి యువతరం విలేఖరి,
వర్షం కురిస్తే గ్రామీణ ప్రజలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. చాలా గ్రామాల్లో మురుగు కాల్వలు లేకపోవడంతో రహదారు లపై వర్షంనీరు, మురుగు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏళ్లు గడు చేస్తున్నా అభివృద్ధి జాడలేక మౌలిక వసతులు కరవయ్యాయి. కొత్తపల్లి మండలంలో 12 పంచాయతీలు 18- మజరా గ్రామాలున్నాయి. వీటిలో ఒక్క పంచాయతీలో కూడా పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు లేకపోవడంతో వానా కాలంలో రోడ్లన్నీ చిత్తడి మారు తుండటంతో ప్రజలకు అవ తప్పడం లేదు.
» మురుగుకాల్వల్లా మారుతున్న రహదారులు
మండల కేంద్రం కొత్తపల్లిలోనే ది సమస్యలు తాండవిస్తున్నాయి. బీసీ కాలనీలో మురుగునీరు రోడ్డుపై పారుతుం డటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎం. లింగా పురంలో రహదారిపై నిత్యం మురుగునీరు ప్రవహిస్తోంది.
భారీ వర్షం కురిస్తే శివపురం- ఎం. లింగాపురం మధ్య పెద్దవాగు పొంగి పది గ్రామాలకు రాకపోకలు ఆగిపో తాయి. ఆయా గ్రామాల ప్రజలు, నిత్యావసర సరకుల దొరకక తల్ల డిల్లాల్సి వస్తుంది. విద్యార్థులు పాఠశాలకు, కళాశాలలకు వెళ్లేం చుకు సాధ్యం కాదు. హైలెవెల్ వంతెన నిర్మించి సమస్య పరిష్క రించాలని దశాబ్దాలుగా కోరు తున్నా పట్టించుకునే వారు లేరని పది గ్రామాల ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.
ముసలిమడుగు గ్రామంలో వర్షం పడితే ముస్లిం కాలనీలోని ప్రధాన రహదారిపై మురుగునీరు నిలుస్తోంది. సీసీ రహదా రులు, కాల్వలేక సమస్య వేధి సింగరాజుపల్లి గ్రామంలో కూడా సీసీ రహదా రులు ఏర్పాటు చేయలేదు.
కుంట, కొత్తమాడుగుల, పాతమాడుగులలో సీసీ రహ దారులు లేక ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు..
శివపురం ఎం.లింగాపురం మధ్య వంతెన లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (పాతచిత్రం)
వంతెన నిర్మించాలి..
– ముర్తుజావలి, వాహనదారుడు, శివపురం
శివపురం- ఎం. లింగాపురం. మధ్య వర్షం కురిస్తే పెద్దవాగు పొంగి ఆత్మకూరు పట్టణానికి, మండల కేంద్రం కొత్తపల్లికి రాక పోకలు ఆగిపోతాయి. పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనారోగ్యం బారినపడిన వారిని అత్యవసర పరిస్థితుల్లో పుట్టిలపై వాగు దాటిం చాల్సిన దుస్థితి. గతంలో వాగులో కొట్టుకు పోయి పలువురు ద్విచక్ర వాహనదారులు గాయాలపాలయ్యారు. అధికారులు స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.