ANDHRA PRADESHPOLITICS
ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు

ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
కొత్తపల్లి యువతరం విలేఖరి;
ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తపల్లి జడ్పిటిసి సభ్యులు సోమల సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సింగారం రంగా అన్నారు. శనివారం దుద్యాల గ్రామంలో వారు జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా నేరుగా ధ్రువీకరణ పత్రాలు అందుకునేందుకే ఈ పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు కే సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగలక్ష్మి రెడ్డి, రహంతుల్లా, గౌస్ తదితరులు పాల్గొన్నారు