ANDHRA PRADESHPOLITICS
నెల్లూరు నగర నాయకులతో యువ గళం పాదయాత్ర పై సమావేశం

నెల్లూరు నగర నాయకులతో యువగళం పాదయాత్ర పై సమావేశం
పాదయాత్ర దిగ్విజయం చేయాలని సూచన
నెల్లూరు యువతరం ప్రతినిధి;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర ను నెల్లూరు నగర నియోజకవర్గం లో దిగ్విజయం చేయాలని టీడీపీ నేతలు శనివారం పిలుపునిచ్చారు. నెల్లూరు లోని నారాయణ మెడికల్ కళాశాల లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర ను దిగ్విజయం చేయాలని సూచించారు. కార్యక్రమం లో జిల్లా టీడీపీ నేత అబ్దుల్ జలీల్, నగర అధ్యక్షుడు మామిదాల మధు, నెల్లూరు నగర నియోజకవర్గ క్లస్టర్, యూనిట్ ఇంఛార్జి లు పాల్గొన్నారు.