ANDHRA PRADESHPOLITICS

జగనన్న సురక్ష పథకం పేదల పాలిట వరం

ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్

జగనన్న సురక్ష పథకం పేదల పాలిట వరం

కొత్తపల్లి యువతరం విలేఖరి;

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలవద్దకే ప్రభుత్వ సేవలు వస్తున్నాయని
ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని దుద్యాల గ్రామంలో ఎంపీడీఓ మేరి అధ్యక్షతన జగనన్న సురక్షకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలకోసం నవరత్నాలు పథకాల శ్రీ ద్వారా ఎన్నో సంక్షేమపథకాలను అమలు చేశారన్నారు. ఇదే తరహలో గ్రామాల్లోని ప్రజలు కుల, మరణ, జనన, ఇన్ కమ్, ఇతర దృవపత్రాల కోసం అధికారుల చుట్టు తిరగకుండా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాటిని ఉచితంగా ఇస్తున్నామన్నారు. ప్రజలు కొన్ని దృపత్రాలు తీసుకోలేక. తప్పులు ఉన్న ప్రభుత్వ సంక్షేమపథాకలను అందిపుచ్చుకోలేకపోతున్నారన్నారు. అర్హులైన ఎవ్వరు నష్టపోకుడదు అన్న సంకల్పంతో ప్రతి సచివాలయంలో గ్రామవలంటీర్లచే వారి కుటుంబాలలో ఎటువంటి సేవలు అవసరమో వాటనికి గుర్తించి వాటికి సంబంధించిన సర్టిఫికేట్లను ఉచితంగా జారీ చేస్తుందన్నారు. గ్రామంలో 204 మందికి అవసరమైన సర్టిఫికేట్లు జారీచేశామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి రఘురామ్, ఇన్చార్జీ తహసీల్దార్ పెద్దన్న, ఏఓ మహేష్, ఎస్సై హుస్సేన్ భాష ఏపీఓ రేష్మ. ఏఈలు రామచంద్రయ్య, త్రిలింగేశ్వరరెడ్డి, ఆర్ఎస్ఐ జహంగీర్ బాషా, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!