జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన

జగనన్న సురక్ష కార్యక్రమానికివిశేష స్పందన
ఆమడగూరుయువతరం విలేఖరి;
మండలంలోని పూ లకుంట్లపల్లి గ్రామ సచివాలయంలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంకు మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. తొలుత పులుకుంట్లపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామాల్లో అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులు ను గత వారం రోజులుగా సచివాలయ సిబ్బంది, వాలంటర్లు సమస్యలను గుర్తించారని వారి సమస్య పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉన్నారు. ఆయా గ్రామంలో అర్హత కలిగిన నిరుపేదలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించుకున్నారు. వారికి అధికారులు రసీలు ఇచ్చి సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శివశంకర్ రెడ్డి, ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, తహసిల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో మునెప్ప, సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, ఎంపిటిసి సురేందర్ రెడ్డి, సచివాల కన్వీనర్ జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, గృహసారతులు, వాలంటీర్లు ఆయా గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.