
కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని కార్యాలయ భవనాల ఆధునీకరణకు చర్యలు
మంత్రి బుగ్గన
కర్నూలు యువతరం ప్రతినిధి;
కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని కార్యాలయ భవనాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వెల్లడించారు.శనివారం కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను మంత్రి బుగ్గన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తో కలిసి పరిశీలించారు.అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆధునీకరణ అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్ వేణుగోపాల్ కలెక్టరేట్ ఆధునీకరణ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లోని ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కనుగుణంగా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను నిర్మించడం జరిగిందని, ప్రస్తుతం
జిల్లా విభజన నేపథ్యంలో అవసరానికి అనుగుణంగా భవనాలను ఆధునీకరించే విధంగా డిజైన్ తయారు చేయాలని ఆర్కిటెక్ట్ కు సూచించారు..కలెక్టరేట్ ముందు భాగాన్ని, సునయన ఆడిటోరియం ను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. శిధిలమైన భవనాలను తొలగించి ఓపెన్ స్పేస్ ఉండేలా చూడాలన్నారు. వాష్ రూమ్స్ బాగుండాలని సూచించారు. మరమ్మతులు చేసిన తర్వాత ఆయా కార్యాలయ అధికారులు వారి కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందుకనుగుణంగా ప్రత్యేకమైన ఎస్ ఓ పి అమలు చేయాలని కలెక్టర్ కు సూచించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక శాఖా మంత్రి చొరవతో కలెక్టరేట్ భవనాల ఆధునీకరణ చేసే అవకాశం లభించిందని, అందుకు మంత్రి కి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ ను మరి కొంత మార్పులతో రూపొందిస్తామని తెలిపారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఉన్న కార్యాలయాల అధికారులు పాల్గొన్నారు.