కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక మద్యం స్వాధీనం
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
కర్ణాటక ప్రాంతం నుండి అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎమ్మిగనూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర రావు ఆధ్వర్యంలో సెబ్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారం ఎస్ ఐ సోమశేఖర రావు విలేకరులకు శనివారం సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ప్రాంతం నుండి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న విషయం తెలుసుకున్న తాము నందవరం మండలం నాగలదిన్నె గ్రామం వద్ద దాడి చేసి రెండు స్కూటర్లపై తీసుకువస్తున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం రవాణా చేస్తూన్న ఇద్దరు వ్యక్తుల నుండి384కర్ణాటక మద్యం ప్యాకెట్లను, రెండు మోటార్ సైకిల్ సైతం సీజ్ చేసినట్లు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.ఈ కేసులో నిందితులైన మండలం కే తిమ్మాపురం గ్రామానికి చెందిన నల్లబోతుల రంగన్న అనే వ్యక్తి నుండి 92కర్ణాటక ఒరిజినల్ చాయ్ ప్యాకెట్లు, అలాగే ఇదే గ్రామానికి చెందిన బోయ రంగస్వామి నుండి మరో 92 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు లభించిన మద్యం విలువ సుమారు 20 వేల రూపాయలు ఉంటుందని ఈ దాడులలో ,హెడ్ కానిస్టేబుల్ గోపాల్ ,లింగ ప్రసాద్, చంద్రమౌళి, కానిస్టేబుల్ నరసింహారెడ్డి, రాధమ్మ, రామచంద్రుడు,
తదితరులు పాల్గొన్నారు