
చేపల చెరువు వేలంపాట వాయిదా
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండల కేంద్రమైన బోగోలు చెరువుకు సంబంధించి చేపల వేలం వేసేందుకు గ్రామంలో బుధవారం సమాయత్తం అయ్యారు. కానీ గత రెండు సంవత్సరములకు చెరువు వేలంకు సంబంధించి డబ్బుల విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో చెరువు వేలంపాట వాయిదా వేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ రామకృష్ణ లు గ్రామంలో గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.