ANDHRA PRADESHCORRUPTIONSTATE NEWS
సిమెంట్ స్వాహకు పాల్పడిన హౌసింగ్ సిబ్బంది

బారీగా సిమెంట్ స్వాహాకి పాల్పడిన హౌసింగ్ సిబ్బంది
అమడుగురు యువతరం విలేకరి;
-
అమడగూ రు మండల పరిధిలోని,గట్టుచప్పుడు కాకుండా
సిమెంట్ బస్తాలు పై స్పష్టత ఇవ్వని అధికారులు
హౌసింగ్ లో బారీ అవినీతి
చూచిచూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అవినీతికి తావు లేకుండా ఎంతో పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఒకపక్క గొప్పలు చేబుతోంది.అయితే మండలంలో హౌసింగ్ అధికారులు చేయి తడపందేపని జరగదు.మండలంలో హౌసింగ్ అధికారులు లబ్దిదారులకు ఇవ్వల్సిన సిమెంట్ బస్తాలను ఇవ్వకుండా బారీ స్థాయిలో హౌసింగ్ సిబ్బంది సిమెంట్ బస్తాలను స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది.విస్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు అమడగూరు మండలంలో హౌసింగ్ ఇల్ల నిర్మాణం కోసం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని గౌడన్ లో సిమెంట్ ను బద్రపరిచారు.ఆ గౌడన్ నుంచి ఇంటి లబ్దిదాతులకు సిమెంట్ ను పంపిణి చేస్తారు.అయితే హౌసింగ్ ఏఈ బానుప్రకాష్ ,సిబ్బంది కలిసి పేదలకు అందల్సిన సిమెంట్ బస్తాలను బారీ స్థాయిలో స్వాహా చేసి కర్ణాటక కు తరలించినట్లు సమాచారం.బాను ప్రకాష్ సిమెంట్ బస్తాలే కాక హౌసింగ్ లబ్దిదారుల నుంచి ఇంటి బిల్లుల మంజురు చేస్తాన ని బారీగా ముడుపులు తీసుకొనట్లు ఆరోపణలు బలంగా వున్నాయి.అంతేకాకుండా జీయో ట్యాగ్ కి,ఇంటి నిర్మాణ లెవల్ ప్రకారం వివిద దశల లో లబ్దిదారుల నయండి ఒక్కొక్కరి నుండి ఐదు వేలు నుండి పదివేలు దాక ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ద్వారా డబ్బులు అందుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.మండలంలో ఇంటి నిర్మాణాలు కూడా ఏఈ నిర్లక్ష్యం తో నత్తనడకగా సాగుతున్నాయి.ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు అధికారులు మాత్రం ఇళ్ల నిర్మాణాలు ఆగష్టు లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ముందుకు సాగులేదు.ఇంత జరుగుతున్న హౌసింగ్ జిల్లా అధికారులు డివిజన్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలుకు దారి తీస్తోంది.ఇది ఇలా వుంటే మండలంలో హౌసింగ్ అధికారులు సిమెంట్ బస్తాలు స్వాహా చేసిన విషయం పై మంగళవారం విచారణకు వచ్చిన అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా హౌసింగ్ అధికారులను వెనక్కు వేసుకొచ్చేవిధంగా విచారణ అధికారి వ్యవహరిస్తున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన అవినీతికి పాల్పడిన హౌసింగ్ అధికారులు పై చర్యలు తీసుకుంటారా లేక వత్తాసు పలుకుతారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.