సంగమేశ్వరం లో భక్తుల రద్దీ

సంగమేశ్వరం లో భక్తుల రద్దీ
సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం
కొత్తపల్లి యువతరం విలేఖరి;
తొలి ఏకాదశి సందర్భంగా గురువారం సంగమేశ్వరం భక్తసంద్రంగా మారింది. తెలంగాణ రాష్ట్రము, ఇతర జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యల తరలివచ్చి సంగమేశ్వరుని దర్శించుకున్నారు ముందుగా సప్త నదుల్లో స్నానాలు ఆచరించి, నదీమ తల్లికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలోకి ప్రవేశించి వేపదార శివలింగాన్ని దర్శించుకున్నారు అనంతరం నవగ్రహ విగ్రహమూర్తులకు కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో సంగమేశ్వరం భక్తసంద్రంగా మారింది. నది తీరం వెంబడి సందడి వాతావరణం నెలకొంది.
ప్రమాదకరంగా బోట్ల ప్రయాణం
తెలంగాణ నుంచి వచ్చే భక్తులను సోమశిల నుంచి సంగమేశ్వరానికి కృష్ణా నదిపై ప్రమాదకరంగా భక్తులను చేరవేశారు. ఎటువంటి లైఫ్ జాకెట్స్ ధరించకుండా, పరిమితికి మించి బోట్లలో ప్రయాణికులను ప్రమాదకరంగా చేరవేశారు. సోమశిల నుంచి సంగమేశ్వరానికి చేరవేయుటకు 100 రూపాయలు చార్జి పెట్టడంతో రానుపోను బోటు కె 200 ఖర్చవుతుందని దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.