
రాయలసీమ విద్య,వైజ్ఞానిక, రాజకీయ,సైద్ధాంతిక శిక్షణా తరగతులను జయప్రదం చేయండి
ఏఐఎస్ఎఫ్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
సమరశీల ఉద్యమాల రథసారథి ఏఐఎస్ఎఫ్ రాయలసీమ జిల్లాల శిక్షణా తరగతులను జూలై 4,5,6 తేదీలలో మంత్రాలయంలో నిర్వహిస్తున్నామని, వాటిని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్,జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర, థామస్ లు పిలుపునిచ్చారు.బుధవారం శిక్షణా తరగతులకు సంభందించిన కరపత్రాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలు చదువుకోవడం మానేస్తున్నారు. దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగ చరిత్రను చేరిపేస్తున్నారు.రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో ఉన్న స్కూళ్లను కుదించి ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ మిగులు ఉపాధ్యాయ పోస్టులు చూపిస్తున్నారని, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలను కూడా విద్యార్థులే కొనుగోలు చేయాలని చెప్పడం ప్రభుత్వ విద్యపై చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చని వారు తెలిపారు.నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి విద్యార్థులపై రుద్దితే విద్యార్థులకు అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తక్షణమే ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో ఉన్న పాఠ్య భాగాలు యధావిధిగా కొనసాగించాలని,దానిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన కూడా కేంద్రానికి సిగ్గులేకుండా ముందుకు వెళ్లడం ముర్కపు చర్య అని అన్నారు.జూనియర్ కళాశాల విద్యార్థులకు మిరే పుస్తకాలు కొనుక్కోండి అని ఆదేశాలు జారీ చేయడం చాలా దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. విద్యారంగంలో వస్తున్న సమూల మార్పులపై చర్చించేందుకు జూలైలో రాయలసీమ జిల్లాల శిక్షణా తరగతులు మూడురోజుల పాటు మంత్రాలయంలో నిర్వహిస్తున్నామని,ఈ శిక్షణా తరగతులకు విద్యావేత్తలు, మేధావులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్ లు వస్తున్నారని,కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఈ మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల సహకరించాలని కోరుతున్నాము. కరపత్రాలు విడుదల చేసిన వారిలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మునిస్వామి,ఖాదర్,ఈరేష్, సమీర్,ఉదయ్,చాంద్, నరసింహ,నాయుడు,వీరేష్, సురేష్, బాబు, రవి, తదితరులు పాల్గొన్నారు.