మృతుడి కుటుంబానికి పరామర్శ
సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించిన సబ్ రిజిస్టర్ తస్లీమా

మృతుడి కుటుంబానికి పరామర్శ
సర్వర్ చారిటబుల్ ట్రస్టు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా..
ములుగు జిల్లా, యువతరం ప్రతినిధి.
ములుగు జిల్లా నిరుపేద మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు.
ములుగు జిల్లా కేంద్రం గడిగడ్డకు చెందిన పాముకుంట్ల స్వామి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.
విషయం తెలుసుకున్న తస్లీమా బుధవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అతడి మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు.
సర్వర్ చారిటబుల్ ట్రస్టు , ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యంతో పాటు 2 వేల రూపాయలు అందించి సహృదయాన్ని చాటుకున్నారు.తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు , ఫౌండేషన్ సభ్యులు,తదితరులు ఉన్నారు.