AGRICULTUREANDHRA PRADESHSTATE NEWS
ముందే నాటితే ముంచేసింది

ముందే నాటితే.. ముంచేసింది
కొత్తపల్లి యువతరం విలేఖరి;
ఖరీఫ్ ప్రారంభంలో బోర్లు బావుల కింద ముందస్తుగా సాగు చేసిన రైతులు వర్షాలు కురవక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ఎదుగుదల లేకపోవడంతో పంటలను దున్నేస్తున్నారు. కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు గ్రామానికి చెందిన బోయ శివలింగం మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని నెల రోజుల క్రితం పత్తి సాగు చేశాడు. పంటకి మొదటిసారి రసాయన ఎరువులు అందించాడు. అయినా ఎదుగుదల లేకపోవడంతో గురువారం వారి కుటుంబ సభ్యులు పత్తి పంటను పీకేసి ఎద్దుల సాయంతో దున్నేశారు. కౌలు మూడు ఎకరాలకు రూ.55 వేలకు తీసుకునీ బోర్ ఉందని ఆశగా ముందుగానే పత్తి సాగు చేశారు. పంట విత్తనం వేసి నెలరోజులవుతున్న ఎదుగుదల లేకపోవడంతో బుధవారం కురిసిన వర్షానికి గురువారం పత్తి పంటను పీకేసి దున్నేశారు. దాంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.