భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
అమడగూ రు యువతరం విలేకరి;
మండల కేంద్రంలో,త్యాగానికి ఐకమత్యానికి,ప్రతీకగా బక్రీద్ పండగ నిర్వహించారుముస్లిం సోదరులు తమవంతుగా పేదలకు వస్తు రూపంలో గాని, దానాలు చేసి త్యాగానికి ప్రతీకగా నిలిచే పండగే బక్రీద్ పండగను పురస్కరించుకుని గురువారం మండలంలోని ఆమడగూరు,మహమ్మదాబాద్, తుమ్మల, చిన్నగానిపల్లి,, పూలకుంటపల్లి, లోకోజిపల్లి, తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీదు పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తొలత ఉదయాన్నే ఈద్గాలు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ బక్రీద్ పండగ త్యాగాలకు ప్రతీకా అని ఎంతోమంది నిరుపేదలకు సేవ చేసే గుణం బక్రీద్ పండుగ ద్వారానే వచ్చిందని వారు తెలిపారు. బక్రీద్ పండగ త్యాగానికి కాదు హిందూ ముస్లింల ఐక్యతకు ఈ పండగ ఎంత దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు