బదిలీపై వెళ్లిన సచివాలయ ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం

బదిలీ పై వెళ్ళిన సచివాలయ ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం
తుగ్గలి యువతరం విలేఖరి;
మండలం పరిధిలోని రామకొండ గ్రామ సచివాలయంలో సచివాలయ కార్యదర్శి ప్రభాకర్, బేతంచర్ల మండలం అంబాపురం సచివాలయం కు ,సచివాలయ మహిళా పోలీస్ సంధ్య దేవనకొండ మండలం అలర్దిన్నె సచివాలయానికి బదిలీపై వెళ్లడంతో వారికి బుధవారం స్థానిక సచివాలయ ఉద్యోగులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి, ఘనసన్మానం తో వీడ్కోలు పలికారు. ఈ సన్మాన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు రవి, శివుడు నాయక్, జయంతి, మౌనిక, విశాలాక్షి లు మాట్లాడుతూ ప్రభాకర్, సంధ్యాలు బదిలీలపై వెళ్లడం వల్ల మంచి సహా ఉద్యోగులను కోల్పోవడం బాధాకరమని ,వారు ఎక్కడ వున్న బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.
అంకిత భావం, క్రమశిక్షణ అందరికీ ఆదర్శ ప్రాయం అని అన్నారు. ప్రజలకు
వీరు చేసిన సేవలు చిరస్మణీయం అని ,పని చేసే వారు ఎక్కడకు వెళ్ళినా అదే విధంగా పని చేస్తారు.కాబట్టి ఇక్కడ వీరికి లభించిన గౌరవం అక్కడ కూడ లభిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ఇక్కడి నుండి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమని, అయితే కుటుంబం గురించి బదిలీపై వెళుతున్నట్లు ఆయన తెలిపారు.ఇక్కడ ప్రజలు అందించిన మమకారం మరువలేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి ఉమాదేవి ,ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.