
ఫీజు ఎక్కడ కంస మామ టిఎన్ఎస్ఎఫ్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థ,అనాలోచిత నిర్ణయాల వల్ల యావత్ ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులందరూ తమ విద్యను కొనసాగించలేక తమ ఫీజులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారని టిఎన్ఎస్ఎఫ్ అద్యక్షులు మాదిగ నాగరాజు సి.రంజిత్ కుమార్ లు అన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డా.బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు,21వ వార్డు కౌన్సిలర్ విజిఏ దయ సాగర్ ముఖ్య అథితిగ హాజరై కంస మామ ఫీజు ఎక్కడ అనే వాల్ పోస్టర్లను సిద్దార్థ డిగ్రీ కాలేజీ నందు విద్యార్థుల సమక్షంలో వాల్ పోస్టర్లను బుధవారం విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మధ్యలో విద్యకు దూరం అవుతున్నప్పటికీ,ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేద విద్యార్దుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కాస్తైనా కనికరం లేకుండా చేస్తున్నందున,ఫీజు ఎక్కడ కంస మామ అనే వాల్ పోస్టర్లును టిఎన్ఎస్ఎఫ్ విడుదల చెయ్యడం జరిగింది.జీఓ నెం51 52 ద్వారా ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసేలా జీఓ లు వెనక్కి తీసుకోవాలనీ,జీఓ 71ను రద్దు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనీ,పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన,వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే అమ్మ ఒడి ద్వారా ఆర్హ్వులైన ప్రతి ఒక్క విద్యార్థికీ అందించాలని,అలాగే హాస్టల్ లో వసతులు లేక,సొంత భవనాలు లేక ఇబ్బందులు గురవుతున్నారని ఆయన మండి పడ్డారు.అలాగే హాస్టల్ విద్యార్థులకు మేస్ అండ్ కాస్మెటిక్ చార్జెస్ ను వెంటనే ఇవ్వాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అర్జున్ శశి,భీమా గౌడు,ఉరుకుందు,నరేషు,సోషల్ మీడియా హరి తదితరులు పాల్గొన్నారు.