
పొంగులేటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి
భద్రాద్రి యువతరం ప్రతినిధి.
జూలై రెండవ తేదీన పొంగులేటి బహిరంగ సభను విజయవంతం చేయాలని సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో జులై 2 తారీఖున భారీ బహిరంగ సభ తో జాయిన్ అవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ క్రమంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రభుత్వం వచ్చాక పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూరుతుందని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తాయని అన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుండి పొంగులేటి అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో మద్దెల సమ్మయ్య, పొట్లపల్లి ఉప సర్పంచ్ కస్తూరి లింగయ్య , పేరం వెంకటేశ్వర్లు, ఉడుముల రవి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కొమరం రాములు, నవాతి శ్రీను, బండారు సాంబయ్య, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.