ANDHRA PRADESHPOLITICS
పి ఎల్ పురం నూతన ఉప సర్పంచ్ గా పడాల రాణి

పి.యల్. పురం నూతన ఉపసర్పంచ్ గా పడాల రాణి
పాయకరావుపేట యువతరం విలేఖరి;
పి ఎల్ పురం గ్రామ నూతన ఉప సర్పంచ్ గా పడాల రాణి ఎన్నికయ్యారు.గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏకగ్రీవంగా పడాల రాణిని ఎన్నుకున్నారు. ఈ మేరకు పలువురు ఉప సర్పంచ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల సోమన్న దొర, మాజీ ఉప సర్పంచ్ మేడిశెట్టి వీర వెంకట్రావు, నాగం బుల్లి దొర, పంచాయతీ కార్యదర్శి బి.ఏ. బి.ఎల్ మూర్తి, డిజిటల్ అసిస్టెంట్ భాష, గ్రామ పెద్దలు అడపా నాగ సత్యనారాయణ, చల్లపల్లి సత్యనారాయణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.