
దళిత బంధు యూనిట్ ను ప్రారంభించిన ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్
కోహెడ యువతరం విలేఖరి;
మండలం ఆరేపల్లి గ్రామంలో వేల్పుల లక్ష్మణ్, విజయలక్ష్మి లకు మొదటి విడతలో మంజూరైన దళిత బంధు యూనిట్ గతంలో మంజూరైనప్పటికీ దుకాణానికి సంబంధించిన సెటర్ పూర్తి కాకపోవడంతో బుధవారం పూర్తిచేసుకుని తేజ్ సాయిరాం నిట్టింగ్ కిడ్స్ వేర్ ను ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి లు ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంతో పేదల జీవితాల్లో వెలుగు నింపారు అన్నారు. దళితులను ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్,
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.