
దళితుల పక్షపాతి సీఎం.జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర ఎస్సీ కమీషన్ మెంబర్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
ఎమ్మిగనూరుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ మెంబర్ కే. బసవరాజు బుధవారం అతిధి గృహంనకు చేరుకు న్నారు.వీరికి ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , ఎమ్మిగనూరు తహశీల్దారు కే. ఆంజనేయులు పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈకార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న, విఆర్వో షేక్షావలి ఉన్నారు.అనంతరం ఏర్పాటు అతిధి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ మెంబర్ కే. బసవరాజు మాట్లాడుతూ మంత్రాలయం మండలం, సూగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన డాక్టర్ బిఆర్.అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా పాల్గొనుటకు వచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులు అంటే ఎంతో అభిమానమని, అంత అభిమానం ఉన్నందున విజయవాడ నగరంలో 150 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారని,దళితులకు ఇంతకంటే ఏమి కావాలని ప్రశ్నించారు. దళితులకు అనేక సంక్షేమ పథకాలను ఇచ్చారని వాటిని దళితులు సద్వినియోగం చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని చేతులెత్తి నమస్కరించారు.