
తిండిఅయన పెట్టండి బకాయిలు అయిన చేల్లించండి
ఉపాధి కూలీలు ఆకులతో నిరసన
దేవరపల్లి యువతరం విలేఖరి;
తిండిఅయన పెట్టండి కూలి బకాయిలు అయిన చేల్లించండి గడ్డి తిని బ్రతక మంటారా అంటూ దేవరాపల్లి మండలం లోని ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నిర్సన తెలిపారు అనంతరం వ్వవసాయకార్మిసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కూలీలకు నాలుగు వారాలుగా చేల్లించవలసిన భకాయిలు చేల్లించ కుండా కూలిలను పస్తులు పడుకో బెడుతున్నారని ఇది అత్యంత దుర్మార్గపు చర్యని తెలిపారు, క్షేత్రస్థాయిలో మేట్లకు స్మార్ట్ ఫోన్లు పారితోషికం ఇవ్వాలని తట్టగునపాం, పారకు డబ్బులు ఇవ్వాలని, సమ్మర్ ఎలవెన్స్ కోనసాగించాలని ట్రావిలింగ్ ఎలవెన్స్ ఫేసిప్పులు మంచి నీళ్ళు కు డబ్బులు ఇవ్వాలని మేడికల్ కిట్టులు టెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు,
వేడి నీళ్ళకు చల్ల నీళ్ళు తోడైనట్లు వ్యవసాయ పనులు లేని సమయంలో రైతు కూలిలకు ఉపాధిహామీ చట్టం కాపాడుతుందని. ఎండా కాలంలో ఏ పనులు దొరకక వ్యవసాయ కూలీలు మొదలు కొని డిగ్రీ చదువుకున్న యువతీ, యువకుల వరకు ఉపాధి పనులకు వెళుతున్నారని. ఉపాధి చట్టం పేదలకు వరంలాంటిదని
అటువంటి చట్టానికి మరింతగా నిధులు పెంచి అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని ఎత్తివేసి కూలీలు పొట్ట కొట్టాలని చూస్తుందన్నారు పెట్టుబడిదార్లుకు లక్షల కోట్లు నల్సిడీగా ఇస్తున్న ప్రభుత్వం పేదలకు నిధులు తగ్గిస్తున్నదని తెలిపారు.ఒక సారి చట్టాన్ని రద్దు చేస్తే కూలీలు తిరగబడతారనే భయంతో ఈ పథకంలో అనేక షరతులు పెట్టింది. ఒక పూటకు బదులు రెండు పూటలు పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని. సమ్మర్ అలవన్స్ రద్దు చేశారని మంచినీళ్ళకు, పార, తట్టు,గడ్డపాం పరుగుకు ఇచ్చే డబ్బులు నిలిపి చేశారని. ఆన్లైన్ మస్టర్లు పెట్టి పేదలను ఇబ్బాంది ‘పెడుతున్నారని పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేయాలని కూలీలకు కేటాయించే నిధులను సిమెంట్ రోడ్లను,సచివాలయాలకు భవనాలకు మెటీరియల్ చార్జీలు పెరుచేప్పి రాష్ట్ర ప్రభుత్వ వాడుకుంటుందని, తెలిపారు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిదుల్లో ఎలవెన్స్ లు కలిపి ఇవ్వవలసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిలో నిదులను వాడు కుంటుందని అగ్రహం వ్యక్తం చేశారు మండుటెండలో ఎటువంటి సౌకర్యాలు లెక పోయిన నేలకాడక పోయిన దూరప్రాంతాలు నీళ్ళు మోసి పనిచేస్తూన్నారని తెలిపారు, అంటువంటి కూలీలకు నేలలు తరబడి బకాయిలు చేలించడం లెదన్నారు తక్షణమే పెండింగ్ బకాయిలు వెంటనే చేల్లించాలని డిమాండ్ చేసారు, ఈకార్యక్రమంలో అదిక సంఖ్యలో కూలీలు పల్గోన్నారు,