గ్రూప్ 4 అభ్యర్థులు నియమాలు పాటించాల్సిందే

గ్రూప్ 4 అభ్యర్థులు నియమాలు పాటించాల్సిందే
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
గ్రూప్- 4 అభ్యర్థులు జులై 1న జరిగే పరీక్షకు శనివారం ఉదయం 9:45 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గ్రూప్- 4 పరీక్ష రాసే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు పాటించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో చెప్పారు. రెండవ పేపర్ కోసం శనివారం మధ్యాహ్నం 2:15 గంటల్లోపు అభ్యర్థుల పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని పేర్కొన్నారు. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో టీఎస్పీఎస్సీ గైడ్లైన్స్ పటిష్టంగా అమలు చేయవలసిన బాధ్యత చీప్ సూపరిండెంట్ల దేనిని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. బంగారు అభరణాలు ధరించవద్దని తెలిపారు. పరీక్షకు అభ్యర్థులు చెప్పులు ధరించి హాజరుకావాలని పేర్కొన్నారు. అభ్యర్థులను చెక్ చేసేందుకు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధార్/ పాన్ కార్డ్/ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకొని రావాలని చెప్పారు. *గ్రూప్ – 4 పరీక్షకు 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రం గేటు మూసి వేస్తారని సూచించారు.* శనివారం ఉదయం జరిగే పరీక్షకు ఉదయం 8 గంటల నుంచి 9:45 గంటల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2:15 గంటల వరకు అభ్యర్థులకు పరీక్ష కేంద్రం లోనికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం గేటు మూసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని తెలిపారు. జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను పోలీసులు ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి నిబంధనలు పాటిస్తూ తరలించాలని చెప్పారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోనే ఉండాలని పేర్కొన్నారు.